వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక స్పందించారు. ’జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు. నేనూ అదే ఆశతో అడుగులు వేశా. అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా‘ అని అన్నారు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారని తెలిపారు. ప్రస్తుతం నిహారిక ‘వాట్ ది ఫిష్’లో నటిస్తున్నారు.
