మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే దర్శకుడు, ఇతర వివరాల్ని వెల్లడించలేదు. కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇది 29వ సినిమా కావడం విశేషం.
