మన్యం న్యూస్, మంగపేట.
బి.ఆర్.ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు చేతుల మీదుగా మేడారం లో కొలువైన మహిమ కలిగిన వనదేవతలు సమ్మక్క సారక్క జాతర పాటల సీడీ ఆవిష్కరణ చేయడం జరిగింది. పాటల రచయిత,గాయకురాలైనా మద్దెల సమ్మక్క నిరుపేద కుటుంబానికి చెందడం వల్ల ఆమె ప్రతిభన ఆర్ధిక కారణం వలన ఇన్నాళ్లు వెనకబడి ఉండటం తో, ఆర్ధికంగా సమ్మక్క కు చేయూతను ఇచ్చి,ఈ సమాజానికి ఆమె ను ప్రోత్సాహం ఇచ్చి,ఆర్థిక సహకారం అందించి ముందుండి నడిపించిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు. ఆమెకు ముందు ముందు కూడా సహకారం అందిస్తామని ఆమె ప్రతిభ ను రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా మా నుండి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు .. ఎం.పీ.పీ అంతటి విజయ, శివాలయం చైర్మన్ తాండూరి రఘు, జిల్లా నాయకులు తాటి కృష్ణ, ఎంపీటీసీ కుమ్మరి చంద్రబాబు, కాకులమర్రి ప్రదీప్ రావు , మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రామ్ నరసయ్య ,మాజీ మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దడిగెల సమ్మయ్య, భాస .శేషు, చందగట్ల తిరుపతి, బీసా సాంబయ్య, భాస పుల్లయ్య, కొమరం పుల్లారావు, మద్దెల.రాజేంద్రప్రసాద్, జై భీమ్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు..