మన్యం న్యూస్ , బూర్గంపహాడ్:బూర్గంపాడు మండలంలో మొరంపల్లి బంజర రైతు వేదిక నందు ఐటిసి బంగారు భవిష్యత్ మరియు వాష్ సంస్థలు సంయుక్తంగా డి ఎల్ పి ఓ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శులకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎన్ ఐ ఆర్ డి హైదరాబాద్ నుండి శిక్షకుడిగా కే ఉపేందర్ విచ్చేసి గ్రామ కార్యదర్శులకు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలో వివరించి శిక్షణ ఇచ్చారు. డి ఎల్ పి ఓ పవన్ మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కార్యదర్శుల విధినిర్వహణ, అభివృద్ధి ప్రణాళిక తయారీలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఐటిసి వారు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.ఐటిసి చీఫ్ మేనేజర్ చెంగల్ రావు మాట్లాడుతూ ఐటిసి చుట్టుప్రక్కల గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శిక్షణ అనంతరం గ్రామస్థాయిలలో తయారు చేసిన ప్రణాళికలను, లక్ష్యాలను సాధించడానికి తమ వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి డిఎల్ పి ఓ పవన్, బూర్గంపాడు ఎంపీ ఓ సునీల్ శర్మ, అశ్వాపురం ఎంపీ ఓ శ్రీనివాసరావు, ఐ టి సి ఎం యస్ కే ప్రోగ్రాం మేనేజర్ జయ ప్రకాష్, వాష్ పి ఓ విజయ్, బూర్గంపాడు అశ్వాపురం మరియు దుమ్ముగూడెం మండలాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మరియు వాష్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.