UPDATES  

 వెంకటేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

  • వెంకటేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
  • వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వరరావు

మన్యం న్యూస్ గుండాల: వెంకటేశ్వర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కొడవటంచ గ్రామంలో నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర హాస్పిటల్ వైద్యులు మోకాళ్ళ వెంకటేశ్వరరావు కోరారు. ఆదివారం కొడవటం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు, ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా బీపీ, షుగర్, మూర్చ వ్యాధి, శ్వాసకోస సమస్యలతో పాటు చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలకు వైద్యులు ఉచితంగానే వైద్య సదుపాయం అందించి మందులు కూడా ఇవ్వబడుతుందని అన్నారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని గుండాల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !