మన్యం న్యూస్ గుండాల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్ను ఆదివారం పిడిఎస్యు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఇర్ఫా రాజేష్ మాట్లాడుతూ 2020 నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి మూడో తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం విద్య వ్యాపారం చేసుకొని కొందరు కార్పోరేట్ శక్తులు కోట్లాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి జనగాల్ల పేరుస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు విద్యను ధారా దత్తం చేసిందన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, రాజేష్, రాజు, శ్యామ్, రవి, యాకూబ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు
