ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ తాజాగా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ డీల్ అని అంటున్నారు.
కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘దేవర’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. ఇదంతా ఒకెత్తయితే.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ గురించి ఓ వార్త బయటకొచ్చింది. ‘దేవర’ మూవీ ఓవర్సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రూ.27 కోట్ల ధరకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు కాగా.. ఎన్టీఆర్ సినీ కెరీర్లో హైయ్యెస్ట్ డీల్ ఇదేనని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్ఎక్స్ వంటి పెండింగ్ వర్క్. ఈ కారణంగానే మూవీ వాయిదా పడే అవకాశముందని అంటున్నారు.