UPDATES  

 ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో ‘లైగర్’ ఎన్నో అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న హీరో, దర్శక నిర్మాతలు, అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. ఇక ‘లైగర్’ తర్వాత విజయ్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఈ సారి భారీ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తనకు ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో ఓ మూవీ చేస్తున్నారు.

 

దర్శకుడు పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘గీత గోవిందం’ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయ్‌పై కొన్ని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20 నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట.

 

ఇకపోతే సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !