UPDATES  

 బాక్సాఫీసు వద్ద ‘హనుమాన్’ వసూళ్ల ప్రభంజనం..

కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా.. ఎంతటి చిన్న హీరోనైనా.. ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా అలాంటి ఓ అద్భుతమైన కంటెంట్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘హనుమాన్’. ఈ సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ ప్రేక్షకాదరణతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేగాక ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

 

విడుదలైన పది రోజుల్లోనే ‘హనుమాన్’ దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటింది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీసు వద్ద మరోసారి తన హవా చూపించింది. ముఖ్యంగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 15వ రోజు రూ.10 కోట్ల వరకు గ్రాస్ అందుకుని అబ్బురపరచింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే.. 15 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి అదరగొట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !