ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘పుష్ప-2’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రధాన తారగణం కీలక పాత్ర పోషిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. అంతేగాక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదని.. చాలా వర్క్ పెండింగ్‌లో ఉందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అదంతా నిజమే అని అంతా అనుకున్నారు. ఈ విషయంపై మూవీ యూనిట్ కూడా స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు ఆందోళనలో చెందారు.
ఈ వార్తలపై ‘పుష్ప2’ చిత్రబృందం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. పక్కాగా తమ మూవీ అనుకున్న సమయానికే అంటే.. ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.