‘సలార్’ మూవీలో నటించిన ఎమ్మెస్ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సలార్ సినిమాలో ఓ సీన్‌లో భాగంగా దేవా నా కాళ్లు పట్టుకోవాలి. అయితే షూటింగ్ సమయంలో డార్లింగ్ డూప్ ఆ సీన్స్ చేస్తానని అన్నాడు. కానీ దానికి ప్రభాస్ ఒప్పుకోకుండా అతనే వచ్చి మూడుసార్లు నా కాళ్లు పట్టుకున్నాడు. డార్లింగ్ ఎంతో మంచి మనిషి. చాలా సింపుల్‌గా ఉంటాడు’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
