మన్యం న్యూస్ గుండాల: మండలంలోని గలబా, వెన్నెల బైలు, చెట్టుపల్లి గ్రామాల్లోని బిఎస్ఎన్ఎల్ టవర్ల వద్ద ఉన్న బ్యాటరీలు చోరీకి గురైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్కొక్క టవర్ వద్ద 40 బ్యాటరీలు చొప్పున మొత్తం 120 బ్యాటరీలను మధ్యాహ్నం సమయంలో దొంగలు చోరీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది