సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ హను రాఘవపూడి స్వయంగా శ్రీలీలను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
