బాలీవుడ్ నటి మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై తాను స్పందించినట్లు వస్తున్న వార్తలపై నటి శ్రద్ధాదాస్ క్లారిటీ ఇచ్చారు. ‘‘మన్నారా చోప్రా, ఆమె కుటుంబం గురించి నేను ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ స్పందించలేదు. పబ్లిసిటీ కావాలనుకుంటే ఇన్‌స్టా లేదా ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేసేదాన్ని. నిజమే నేను బాధకు గురయ్యా. కానీ, వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా’’ అని శ్రద్దా పోస్ట్ పెట్టారు.
