ట్రాప్ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్ ప్రీతీ రజక్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో వెండి పతకం సాధించి ఛాంపియన్ ట్రాప్ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు. పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో శిక్షణ పొందుతున్నారు.
