UPDATES  

 నేనే రాజు నేనే మంత్రి..ప్రజా సమస్యలను సైతం పక్కన పెట్టేసిన జడ్పిటిసి..

  • నేనే రాజు నేనే మంత్రి

    ప్రజా సమస్యలను సైతం పక్కన పెట్టేసిన జడ్పిటిసి

  •  చరవానికి సైతం దూరంగా ఉంటున్న ప్రజాప్రతినిధి
  • ప్రశ్నిస్తే కేసులు పెడతానని బెదిరింపులు.
  • అనుచరులతో పాలన కొనసాగిస్తున్న ప్రజా ప్రతినిధి
    ఉండటానికి గూడులేని చెన్నూరు గ్రామాన్ని మచ్చుకైనా చూడని మహోన్నతురాలు

    మన్యం న్యూస్ చర్ల.

గత కొంతకాలంగా నీరు కరెంటు రోడ్డు సౌకర్యం లేక బాధపడుతున్న చలిమెల ఉయ్యాలమడుగు చెన్నాపురం గ్రామ అభివృద్ధి విషయమై ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ ఆయా గ్రామాలలో నేటికీ నీటి పోరాటం జరుగుతూనే ఉంది. మండలంలో ఉన్న మిషన్ భగీరథ అధికారులు గానీ గ్రామపంచాయతీ సర్పంచ్ గాని మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గానీ మండల ప్రజా పరిషత్ ప్రజా ప్రతినిధి గాని ఊరు మొఖాన చూసింది లేదు. అని గ్రామ ప్రజలు తెలిపారు. ఏ అధికారి స్పందించని నేపద్యంలో చర్ల మండలం జడ్పిటిసి ని పత్రికా ప్రతినిధి ఈ విషయం పట్ల వివరణ కోరగా నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను పత్రికా విలేకరులు నాకు ఫోన్ చేయొద్దు అంటూ కయ్యా నికి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా నేను పసుపు కొమ్ములు దంచుకోవాలి నేను ఈరోజు ఖాళీగా ఉండను నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తా అని పత్రిక ప్రతినిధిపై దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా ప్రజా సమస్యలు నాకు అన్నీ తెలుసు నేనేం చేయాలో మీరు చెప్పనవసరం లేదు అంటూ ప్రశ్నించిన విలేకరి తో కయానికి దిగినా పరిస్థితులు చూస్తే.. పలు అనుమానాలకు తావినిస్తున్నాయి. నిజంగా ప్రజల కోసమే జడ్పిటిసి అయ్యారా లేక ఆస్తులను కూడా కట్టుకోవలానే సంకల్పంతో జడ్పిటిసి ముసుగు వేసుకున్నారా అనేది ప్రధానంగా మండలంలోవినిపిస్తున్న అంశం. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సుబ్బంపేట వన్ సుబ్బంపేట టు ఇసుకరాంపురంలో తనకు భాగస్వామ్యం కూడా ఉన్నట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ప్రజా సమస్యలు పాతరేసి తన సొంత పనులను చూసుకుంటున్నారు అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సొంత పనులు చూసుకుంటున్నాఆ మేపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఓట్లకు వచ్చి గెలిపించిన తర్వాత ముఖం చాటేయడం ముందు జరిగే ఎలక్షన్లో జడ్పిటిసి పసుపు కొమ్ములు దంచుకుంటూ నిజంగానే బిజీ అయిపోయేలా చేస్తామంటూ మండల ప్రజలు కూడా ఘాటుగా ఆమె చర్య పై విరుచుక పడుతున్నారు. ఏది ఏమైనా ఇంకా మారుమూల గ్రామాలకు నీరు సరైన కరెంటు డ్రైనేజీ వ్యవస్థ రాకపోవడం ఆ గ్రామాలకు పూర్తి స్వతంత్రం వచ్చిందా అన్న చందానంగా ఉన్నాయి . అనిమండల ప్రజలు వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విషయం పట్ల చొరవ తీసుకొని . అడవిలో ఉన్న గ్రామాలకు నీరు కరెంటు బడి సౌకర్యాలు కల్పించాలని, అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారులు జడ్పీటీసీ చేస్తున్న పనులు చాలా అనుమాన స్థితిలో ఉన్నందున జడ్పిటిసి నిధులు ఏవైతే శాంక్షన్ అయ్యాయో ఆ ప్రపోజల్ శాంక్షన్ అయినా గ్రాంటుకు వారు చూపించిన పనికి సరితూగుతున్నాయా లేవా అన్న విషయంపై పూర్తి ఆరా తీయడమే కాకుండా ఇసుక ర్యాంపులలో ఆమెకు వాటా ఉన్నాయని వచ్చిన ఆరోపణలకు ఆమె చేసే జడ్పిటిసి పనికి సంబంధం లేకపోవడం పలు అనుమానాలకు తావినిస్తున్నందున ఈ విషయంలోనూ జెడ్పిటిసి పై పలు విచారణలు చేయవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !