- గిరిజన సమాజం పట్ల నిరంకుశ పాలన విడనాడాలి
- ఫిబ్రవరి3న భద్రాచలం ఐటీడీఏ ఎదుట జరిగే ధర్నాను విజయప్రదం చేయండి-ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్
మన్యం న్యూస్ వాజేడు
మండల కేంద్రంలో జి.ఎస్.పి అత్యవసర సమావేశంలో జిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ మాట్లాడుతూ.ఆదివాసీ సమాజం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన విడనాడాలని గత బిఆర్ఎస్ పాలనలో గిరిజన ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారకుండా చిన్న భిన్నం అయ్యాయని,చెమటోడ్చి పొడు నరికితే వాటికి హక్కు పత్రాలు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందరని అన్నారు,ధరణి పోర్టల్ వ్యవస్థ వల్ల అక్రమంగా ఏజెన్సీలో వలస గిరిజనేతరులు చొరబడి ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని వాటికి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు,అలాంటి ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ.పిబ్రవరి 3న భద్రాచలం ఐటీడీఏ ఎదుట జరిగే ధర్నాను ఆదివాసీ సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ వ్యవస్థ వలన ఆదివాసీల భూములు అన్ని కోల్పోతున్నారని అన్నారు..ఈ సమావేశంలో జిఎస్పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ కార్యదర్శి వెంకటకృష్ణ మట్టి రమేష్ అనిల్ చంటి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.





