- జీవం ఉట్టి పడుతున్న వినోద్ చిత్ర కళా రూపాలు.
చిత్ర కళాకారుడికి సన్మానం చేసిన
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్.
మన్యం న్యూస్, మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్ర కళా ప్రతిభా వంతుడికి సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ మాట్లాడుతూ.. చిత్రకళలో గత 15 సంవత్సరాలుగా ఎన్నో అరుదైన గొప్ప చిత్రాలు గీసి జన హృదయాన్ని ఆకట్టుకున్న విన్ను ఆర్ట్స్ వినోద్ ఎంతో గొప్ప అరుదైన ప్రతిభ కలిగిన దుగినేపల్లి కి చెందిన అజ్మీర వినోద్ కు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అతని ప్రతిభను కూడ మేము సన్మానించినట్టు ..అని భావిస్తున్నాం ఈ సమాజంలో ప్రతిభావంతులు ఉన్న వారి ప్రతిభ ఈ సమాజంలో కనిపించకుండా ఉండడానికి కారణం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు,పేద కుటుంబాల్లో పుట్టడం వల్ల ఎంత ప్రతిభ ఉన్నా గాని సమాజానికి కనిపించకుండానే పోతుంది.. అటువంటి ప్రతిభావంతుల్ని మా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సమాజం ముందుకు తేవాలనేదే మా గొప్ప ఉద్దేశం. ఈ ప్రతిభావంతులకు ఈ సమాజంలో దక్కవలసిన గౌరవం ,వారు పొందాల్సిన విలువ వారికి దక్కడం లేదు, వారికి తగిన విలువనిచ్చి గౌరవించాలన్నదే మా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ గొప్ప ఉద్దేశం, మా ద్వారా ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని గొప్ప స్థాయికి చేర్చడానికి మేము వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం అని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవసలహదారులు కొలగట్ల నరేష్ రెడ్డి , సయ్యద్ బాబా, వైస్ ఛైర్మన్ పుల్లంశెట్టి అజయ్,ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్, కార్యదర్శి ఆత్మకురి సతీశ్,ప్రచారకార్యదర్శి గుగ్గురి మహేష్, ఎండి ఇంతియాజ్, కోశాధికారి కొండపర్తి నగేష్,మీడియా ఇంచార్జ్ కర్రి రామ్మోహన్, సభ్యులు సతీశ్ ఉజ్వల్ మిగతా తదితరులు పాల్గొన్నారు.





