- రామ్మూర్తి కుటుంబానికి అండగా నిలిచిన ఎస్సై రాజశేఖర్
- 25 కేజీలు అందించిన యువత
మన్యం న్యూస్ గుండాల: సాయనపల్లి గ్రామపంచాయతీ కార్మికుడు బొమ్మెర రామ్మూర్తి ప్రమాదవశాత్తు మరణించడంతో రామ్మూర్తి దశదినకర్మకు గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ 50 కేజీల బియ్యం బాధ్యత కుటుంబానికి అందజేశారు. ఎస్సై తో పాటు భారత రాజ్యాంగ పరిరక్షణ నాయకులు షారోజ్, ప్రశాంత్, నవీన్, బొబ్బిలి పవన్ కళ్యాణ్ మరో 25 కేజీల బియ్యాన్ని రామ్మూర్తి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ నాయకులు జీవన్, వాగబోయిన చంద్రయ్య దొర, బిఎస్పీ నాయకులు రాంబాబు, బొమ్మెర శ్రీను తదితరులు పాల్గొన్నారు





