మన్యం, న్యూస్ మంగపేట.
సోమవారం రోజున మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ మేడారం సమ్మక్క సారక్క జాతర సాంగ్ ఆడియో లాంచ్ చేయడం జరిగింది. ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ. ఆదివాసీ అడవి మల్లెలా తన పాటలతో సువాసన సుగంధాలా ను విరాజిమ్ముతున్న మద్దెల సమ్మక్క, ఓ మారుముల ప్రాంతం నిరుపేద కుటుంబం నుండి వచ్చి తానే పాటలు రాసి పాడడం అనేది గొప్ప విషయం. ఇంకా మరెన్నో పాటలు రాసి పాడి రాష్ట్ర, దేశ,వ్యాప్తంగా గుర్తింపు సాధించాలి. ఎల్లప్పుడూ సమ్మక్కకు ఎల్లపుడు మా సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మీడియా ఇన్ఛార్జి గుడివాడ శ్రీహరి, జై భీమ్ రామ్మోహన్, కూకట్ల శ్రీను, రాజేంద్రప్రసాద్ బోడ ప్రవీణ్,రాము తదితరులు పాల్గొన్నారు.





