మన్యం న్యూస్ గుండాల: గుండాల డిసిసి బ్యాంక్ సిబ్బందిపై దాడి చేసిన వారిని రిమాండ్ తరలించామని ఆళ్లపల్లి రతీష్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం ఇల్లందు డిఎస్పి రమణమూర్తి, సీఐ ఇంద్రసేనారెడ్డి సూచనల మేరకు నిందితులను జైలుకు తరలించామన్నారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయన అన్నారు అలాంటి వారిపై చట్టరితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు





