ఛత్రపతి సినిమాలో ‘కాట్ రాజు’ పాత్రతో పాపులరైన సుప్రీత్ రెడ్డి సక్సెస్ఫుల్ విలన్‌గా కెరియర్ కొనసాగించారు. అయితే, ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా సమాచారం ప్రకారం యూపీ క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఓ సినిమాతో సుప్రీత్ రెడ్డి దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.





