ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. మొదటి చిత్రం ఏమాయ చేశావేతో అందరినీ మాయ చేసింది. అయితే సమంత హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైమ్ ఓ సినిమా ఆడిషన్ కు వెళ్లిందట. ఆ మూవీ మేకర్స్ ఆమెను రిజెక్ట్ చేశారట. ఆ చిత్రం 2010లో విడుదలైన స్నేహగీతం. ఫస్ట్ మూవీగా అలా ఛాన్స్ అందుకోవాల్సిన సమంత రిజెక్ట్ అయినప్పటికీ ఇప్పుడు స్టార్ డమ్ తెచ్చుకుంది.
