టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, రానా, సురేశ్ బాబులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఫిల్మ్‌నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసుపై విచారణ చేపట్టిన కోర్టు వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 448, 452, 380, 506, 120బీ కింద కేసు నమోదు చేశారు
