వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద చైనాతో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. చైనాతో దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, భవిష్యత్‌లో చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో సైనికపరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
