సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అక్కడి బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ చేస్తున్న ఫొటోలను ప్రిన్స్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. నీరు గడ్డకట్టే వాతావరణంలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా రాజమౌళితో తెరకెక్కనున్న మూవీ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుండగా, ఈ సినిమా కోసమే మహేశ్ ట్రెక్కింగ్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.