ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ బయోపిక్ కు కొనసాగింపుగా వస్తున్న ’యాత్ర 2‘ను ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. దీనికి పోటీగా పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీ రిలీజ్ చేస్తున్నారు. రెండూ పొలిటికల్ సినిమాలు కావడంతో రాజకీయ వేడి పెరుగుతోంది. మరి ప్రజలు ఏ సినిమాను ఆదరిస్తారు? ఈ సినిమా ప్రభావం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.
