2009లో వచ్చిన ‘ఓయ్’ సినిమా అప్పట్లో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. యంగ్ హీరో సిద్ధార్థ్, శామిలీ జంటగా నటించిన ఈ చిత్రం దాదాపు 15 ఏళ్ల తరువాత మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆనంద్ రంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు సునీల్, అలీ, నెపోలియన్, ప్రదీప్ రావత్, కృష్ణుడు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
