తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. హీరోగా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. సప్తగిరి త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు ఎంతవరకు నిజం ఎంత ఉందనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.!
