తన టాలెంట్ గురించి పొగుడుతున్నారు కానీ, సినిమా అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదని తెలుగు యంగ్ హీరో అడవి శేషు అన్నారు. తాజాగా ఆయన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అడవి శేషు వ్యాఖ్యలపై అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర యూనిట్ స్పందిస్తూ.. మీరు రెండేళ్ల పాటు బిజీగా ఉన్నారని తెలియడంతో మిమ్మల్ని నేరుగా సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.
