కోర్టు తీర్పు అనంతరం జ్ఞానవాపిలోని నేలమాళిగ తెరిచి పూజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు న్యాయవాదుల బృందం ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించింది. వారణాసి కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, తద్వారా ముస్లిం పక్షం న్యాయపరమైన పరిష్కారాలను సూచించాలని అభ్యర్థించింది. దీంతో సీజేఐ గంటసేపు వారితో మాట్లాడారు. ముందుగా హైకోర్టును సంప్రదించాలని ఆ బృందానికి సూచించారు