మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా వచ్చిన ఒకే ఒక్క నటి నిహారిక కొణిదెల. అయితే ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించలేదు. కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నిహారిక తిరిగి హీరోయిన్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో ‘మద్రాస్కరణ్’ అనే సినిమాలో నిహారిక నటిస్తోన్నారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
