ఇంద్ర సినిమా కథా రచయిత చిన్నికృష్ణ మరోసారి మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. బ్యాడ్ టైంలో తెలియక చిరంజీవిపై తప్పుగా మాట్లాడాల్సి వచ్చిందని, ఈ విషయంలో అనేకసార్లు బాధపడ్డానంటూ పలు విషయాలు వెల్లడిస్తూ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం ఎంతో సంతోషకరమని, శుభాకాంక్షలు తెలిపేందుకు అయన ఇంటికి వెళ్తే, రిసీవ్ చేసుకున్న విధానం ఎప్పటికీ మరువలేనన్నారు. చిరు ప్రేమ, ఆప్యాయతలు వెల కట్టలేనివన్నారు.
