శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటించిన లీడర్ మూవీ అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, తాజాగా ఈ మూవీకి సీక్వెల్ ‘లీడర్-2’ వచ్చే అవకాశాలున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శేఖర్ ప్రస్తుతం ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తుండగా, రానా ఇప్పటికే గుణశేఖర్‌తో హిరణ్య కశ్యప, తేజతో రాక్షస రాజా సినిమా చేస్తున్నారు.
