UPDATES  

 ప్రజల మనసు గెలుచుకున్న అధికారి..ప్రజా ప్రతినిధుల చేసే పనులకు సైతం ఆయన పూనుకోక తప్పలేదు…

  • ప్రజల మనసు గెలుచుకున్న అధికారి.
  • ప్రజా ప్రతినిధుల చేసే పనులకు సైతం ఆయన పూనుకోక తప్పలేదు.
  •  కార్యాచరణలో ఆయనదే ముందడుగు
  •  కొన్ని మీటర్ల కాలువను పూడిక తీపించిన సీఐ.
  •  సొంత డబ్బులతో పూడికతీతపై మండలంలో హర్షం..
  •  దేవుడు అంటూ కొనియాడుతున్న గ్రామ ప్రజలు
  •  సిఐ చేసిన మంచి పనిని తన ఖాతాలో వేసుకుందామనిప్రయత్నించిన ఎమ్మెల్యే.

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

వెంకటాపురం మండల కేంద్రంలో చిరుతపల్లి బర్లగూడెం పంచాయతీ లో పంట పొలాలకు వెళ్లే నీటి కాలువలో పూడిక పడడం వల్ల నీళ్లు పారడం లేదని గత కొన్ని రోజులుగా ఆ గ్రామ ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు గానీ ప్రజాప్రతినిధి గాని స్పందించని నేపథ్యంలో,రైతన్న బీటలు వారుతున్న వారి పొలాలను చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పొలాలు కళ్ళముందే ఎండిపోతుంటే అటు సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని మండల ప్రజలు మరియు పదవి విరమణ చేసిన సర్పంచ్ కొర్సా నరసింహమూర్తి వారి బాధను ఎన్నోసార్లు రోడ్డుపై బైఠాయించి తెలియజేసిన వ్యర్థమే అయిపోయిందని వారు తేలిపారు. ఈ నేపద్యంలో గత కొంతకాలంగా ఈ విషయాన్ని గమనిస్తున్న సిఐ కుమార్ తన దార హృదయాన్ని చాటుకున్నారని . శాఖ ఏది అయినప్పటికీ గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఎవరూ చేయని రీతిగా తన సొంత డబ్బులతో కొన్ని మీటర్ల పొడవు,కాలువలో పడిన పూడిక తీయించి కొన్ని వందలాది ఎకరాలకు సాగునీరు పారుటకు తాను ముందడుగు వేశారు. అంటూ గ్రామ ప్రజలు తెలిపారు. ఇంకా నాలుగు రోజులు ఆలస్యం అయి ఉంటే ఎండిపోయిన పొలాలతో పాటు మా గ్రామ ప్రజల మరణాలు చూసేవారు అంటూ నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల గత కొంతకాలంగా సంబంధిత ప్రాజెక్ట్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎంత మొరపెట్టినా రాస్తారోకోలు చేసిన స్పందించని ఏ అధికారి సిఐ కుమార్ స్పందించిన తీరును చూసి ఓర్వలేక చివరికి భద్రాచలo శాసనసభ్యులు సైతం సీఐ చేసిన మంచి పనిని తన ఖాతాలో వేసుకుందామని ప్రాజెక్టు కాలువ పూడికను నేనే చేయమన్నాను అందుకే చేశారు. అని ప్రజలను నమ్మిద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు . ఫోన్ కాల్ ద్వారా పలువురికి చెప్పినట్టుగా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఏ ప్రజా ప్రతినిధి గ్రామ ప్రజలకు స్పందించని నేపథ్యంలో చచ్చిపోతున్న మొక్కకు ఊపిరి పోసినట్టుగా పదవి విరమణ చేసిన సర్పంచ్ కొరస నరసింహమూర్తి అభ్యర్థన మేరకు సకాలంలో సీఐ ప్రజలకు స్పందించిన తీరుపై మనుషులలో దేవుడు అంటే సిఐ కుమార్ అని మండల ప్రజలు వారిపై నేటితరం దేవుడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !