మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో గురువారం రాత్రి 7 గంటల సమయానికి మోదుగు గోపి అనే వ్యక్తి ఉన్నటువంటి ఇల్లు ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది ఇంట్లో ఉన్న సామాన్లు బట్టలు పొలం పేపర్లు కాళీ బూడిద అయ్యాయి. గోపి కి ఇద్దరు చిన్న పిల్లలు అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది వీరిది చాలా బీదకుటుంభం ఈ విషయాన్ని తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబసభ్యులకు తామున్నామనే భరోసాకల్పిస్తూ వారికి ట్రస్ట్ తరుపున 5 వేల రూపాయలు మరియు 25 కేజీ ల బియ్యం పండ్లు దాతలసహకారంతో అందజేశారు ఈ కార్యక్రమం లొ జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్, ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్, కార్యదర్శి ఆత్మకురి సతీష్, కోశాధికారి, కొండపర్తి నగేష్,ముప్పారపు రాజు,మీడియా ఇంచార్జ్ కర్రి రామ్మోహన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,సంతోష్,దివాకర్ రెడ్డి ,పాత్రికేయులు సాంబశివరావు, పాల్గొన్నారు.