మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంబవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి మేమున్నాం అంటూ రాజుపేట బిఆర్ఎస్ గ్రామ కమిటీ చదలవాడ సాంబశివరావు ఆధ్వర్యంలో మోదుగు రాములు కుటుంబానికి 6000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం తో పాటు నిత్యావసర వస్తువు అయిన బియ్యం బ్యాగ్ అందించినారు. ఈ కార్యక్రమం లో యడ్లపల్లి నరసింహారావు, చదలవాడ సాంబ శివరావు, కర్రీ శ్యాంబాబు, మలికంటి శంకర్, కర్రి శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, హుస్సేన్, కౌసర్ పాషా, రాయసాబ్, బండ్ల మధు, పేరయ్య, కుమార్ స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.