- ప్రభుత్వాలు మారిన ప్రజా సంక్షేమ పథకాలు నిలిపి వేయకూడదు.
- దళిత బంధు నిధులు నిలుపుదల దళితుల పొట్ట కొట్టడమే.
- ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమమే ద్యేయం గా పని చేయాలి.
కుడుముల లక్ష్మి నారాయణ.
మన్యం న్యూస్, మంగపేట.
శనివారం మంగపేట మండలం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన బి ఆర్ ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టారని, రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో దళిత బంధు రెండో విడత డబ్బులు జమ చేశారు, వాటి వెంటనే దళిత బంధు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని చేయాలని డిమాండ్ చేశారు.,