UPDATES  

 దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారుల నిరాహార దీక్ష..

 

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో శనివారం మండలంలోని రెండో విడత దళిత బందు లబ్ధిదారులు మండల దళిత బందు సాధన సమితి అధ్య క్షులు బియ్యం శ్రీను ఉపా ధ్యక్షులు జానపట్ల జయరాజు ఆధ్వర్యంలో మండల గ్రామ స్థాయిలో లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అధికారులు తీసుకొని దళిత బందు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బు లు పడే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయిన డబ్బు లను వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జామచేయాలని కోరుతూ మండలంలోని 113 మంది లబ్ధిదారులు నిరాహార దీక్ష చేశారు.ఈ నిరాహార దీక్షలో దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు కొగిల మహేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు కర్రి శ్యాంబాబు చిట్టిమల్ల సమ్మయ్య వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు 7 వ తారీ కు జరిగే క్యాబినెట్ సమావేశం లో దళిత బందు పై స్పష్టమైన వైఖరి తెలపాలని ఎన్నికల కోడ్ వల్ల నిలిచి పోయిన నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.దళిత బందు లబ్ధిదారుల ఒక్క రోజు నిరాహార దీక్షకు బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు కుడు ముల లక్ష్మి నారాయణ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి బాసారికానీ హరికృష్ణ మానవ హక్కుల సంఘం జిల్లా వైస్ ప్రసిడెంట్ గాదె శ్రీనివాస్ మండల అధ్యక్షులు మధుకర్ పాల్గొని వారికీ మద్దతు తెలిపారు.ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో మండలంలోని దళిత బంధు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !