మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంబవించి మోదుగు రాములు ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది, ఈ విషయం తెలుసుకున్న మంగపేట తహసీల్దార్, రెవిన్యూ సిబ్బంది ప్రదేశం ను సందర్శించి అగ్ని ప్రమాదం లో 3లక్షల వరకు నష్టం సంబవించి ఉంటుంది తెలిపారు. బాధితుడు మోదుగు రాములు కుటుంబం నకు తక్షణ సహాయం గా 50 కేజీలు బియ్యం అందజేసి, ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక సహాయం త్వరగా అందేలా చూస్తామని తెలియజేశారు.