పుష్ప-2 షూటింగ్ సెట్ నుంచి ఫొటోలు లీక్ అవ్వటంపై ఆ మూవీ హీరోయిన్ రష్మిక అసహనం వ్యక్తం చేశారు. ‘షూటింగ్ సెట్ నుంచి ఫొటోలు లీక్ చేయటం సరైనది కాదు. ఈ సినిమా కోసం ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలా సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ చేస్తే, మూవీ విడుదల తర్వాత ఆసక్తి ఉండదు. దయచేసి మూవీ ప్రైవసీకి భంగం కలిగించొద్దు’ అని అన్నారు. కాగా, ఆగష్టు 15న పుష్ప-2 విడుదల కానుంది.
