మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఆదిపర్వం. ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోందని చిత్ర నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ సినిమాలో నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు అన్నారు. ఈ మూవీలో రెండు అద్భుతమైన పోరాట సన్నివేశాలను మంచు లక్ష్మి ఎంతో రిస్క్ చేసి చేశారని, ఆ రెండు ఫైట్స్ చిత్రానికి హైలెట్ అని తెలిపారు
