UPDATES  

 బీజేపీని ఆపగలిగే శక్తి ఆ పార్టీలకే ఉంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40 స్థానాలను నిలబెట్టుకునే అవకాశం లేదంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్టీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి వల్లనే ఇండియా కూటమి చెల్లా చెదురవుతోందని కేటీఆర్ అన్నారు. దీనిపై ఆ నేతలు ఆత్మపరీశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలో బీజేపీని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరన్నారు.

 

గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోందని ఆరోపించారు. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !