UPDATES  

 ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనం..

  • ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనం
  • మహబూబాబాద్ ఎంపి సీటు ఆదివాసీలకు కేటాయించాలనీ డిమాండ్.

మన్యం న్యూస్ చర్ల:

ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చర్ల మండలం ఎదిర గుట్టలు శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ యెక్క కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల సాంస్కృతిక, సంప్రదాయ, కళలతో పాటు జాతి హక్కులు, రిజర్వేషన్ ఫలాలు అన్ని రక్షించుకోవలని ఆత్మీయ సమ్మేళనంలో పిలుపునివ్వడం జరిగింది.

ఆదివాసులకు దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్ల పరంగా మహబూబాబాద్ ఎంపి స్థానంలో 2009 , 2014, 2019 సంవత్సరాలుగా ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం, ఇల్లందు, పినపాక, మహబూబాబాద్, ములుగు, డోర్నకల్ , నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా ఆదివాసీల ఓట్లు ఉన్న సీట్లు మాత్రం లంబాడా సామాజిక వర్గానికి కేటాయిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.ఈసారి రాబోవు 2024 ఏప్రిల్ నెలలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి కచ్చితంగా ఆదివాసులకు టికెట్ కేటాయించాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆత్మీయ సమ్మేళనంకు మద్దతుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆశావహులు ఏట్టి వెంకన్న పాల్గొన్నారు.

దాట్ల నాగేశ్వరరావు రాష్ట్ర జేఏసీ ఛైర్మన్,

ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు

ఈసం సుధాకర్,రాష్ట్ర జేఏసీ కన్వీనర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు దబ్బకట్ల సుమన్ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసం రామకృష్ణ, దొర ఆదివాసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర జెఏసీ కన్వీనర్, ఉయిక శంకర్,రాష్ట్ర జేఏసీకన్వీనర్

ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆల్లెం కోటి,తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ప రాజు, ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్

కోర్స నర్సింహమూర్తి, ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గోగ్గెల రామస్వామి,

తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడిగా నాగేశ్వరరావు,తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి తాటి మధు,తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వగాబోయిన చంద్రయ్య దొర జెఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ పడిగా నారాయణ,కొమరం సైదులు,మడకం శ్రీను,

చర్ల, వెంకటాపురం మండలాల పీసా మోబిలైజర్ లు, ప్రజా ప్రతినిధులు, విద్యవంతులు, మేదావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !