- నమోదు తేదీని పొడి గించండి మహాప్రభో.
- ఎమ్మార్వోల నిర్లక్ష్యానికి ఇంకా మిగిలి ఉన్న పట్టభద్రుల నమోదు పత్రాలు.
- బిఎల్వోల పర్యవేక్షణ లోపంతో ఇంకా అప్లై చేసుకొని అనారోగ్యంతో ఉన్న పట్టభద్రులు.
- ఓపెన్ డిగ్రీ పట్టాలు చెల్లవంటూ తిరిగి పంపిస్తున్న వైనం
- సినీ నటులను మరిపించేలా బిఎల్ఓల ఓవరాక్షన్
- గ్రామాలలో బిఎల్వోలు కనబడుటలేదు వినబడుటలేదు.
- మీరే మెమోలు తెచ్చి ఇవ్వండి అంటూ హుకుం జారీ.
- తాసిల్దార్ కార్యాలయంలో తిష్ట వేసుకొని కూర్చున్న .( బి ఎల్ వో లు.
- వారి వైఖరి పై మండిపడుతున్న పట్టాభద్రులు
మన్యం న్యూస్ భద్రాచలం.
భద్రాచలం నియోజకవర్గం లో పట్టా బద్రుల నమోదు విషయంలో బి ఎల్ వో గా నియమించిన వారు సినీ తారల కంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్న పరిస్థితులు 5 మండలాల తాసిల్దార్ కార్యాలయాల నందు నెలకొన్నాయి. బూత్ స్థాయి అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలను సమర్థవంతంగా కృషి చేస్తేనే ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా జరుగుతుంది.
అయితే నేటి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పట్టపదుల 18 ఫామ్ నమోదు ప్రక్రియ తహసిల్దార్ ల నిర్లక్ష్యాల వల్ల నత్తనడక నడుస్తున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొన్నాయి. బిఎల్ఓ ల పరిస్థితి అయితే మరీ అధ్వానం గ్రామాలలో తిరిగి పట్టబద్రుల సంఖ్య వారు నమోదు విషయాలు మరియు దరఖాస్తులలో మార్పులు చేర్పులు లాంటి పనులు దగ్గరుండి వీక్షించి అధికారులకు తోడ్పాటు అందించాల్సిన వారే మాకెందుకులే అన్నట్టు గ్రామాలను వీక్షించకుండా తాసిల్దార్ కార్యాలయంలో తిష్ట వేసి
వెరిఫికేషన్ కోసం పట్టభద్రులనే వారి మెమోలను వారి దగ్గరికి తీసుకురావాలని హుకుం జారీ చేసిన పరిస్థితులు ఐదు మండలాల్లో నెలకొన్నాయి. నిప్పుకు గాలి తోడైనట్టుగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా వీరికి వత్తాసు పలకడం చర్చ నియంశంగా మారింది. చర్ల మండలంలో తాసిల్దార్ కార్యాలయం బయట బీ ఎల్వోలు బైఠాయించి ఏదో సినీ తారల తరహాగ కాలు మీద కాలు వేసుకుని. గంటల తరబడి చరవాణిలో మాట్లాడుతున్న దృశ్యాలు. వారి నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి. వారు చరవాణిలో మాట్లాడుతుంటే పట్ట బద్రులు వారిని చూస్తూ నిలబడి పోవాల్సిన పరిస్థితి.
ఇదిలా ఉండగా, దుమ్ముగూడెం తాసిల్దార్ కార్యాలయంలో ఇంకా 18 ఫార్మ్స్ ని సీలు కూడా విప్పని పరిస్థితులు నెలకొన్నాయి . 18 ఫామ్ నమోదు పత్రాలని గ్రాడియట్లు అడుగుతూ ఉంటే ఫాముల కోసం గంటసేపు వెతకాల్సిన పరిస్థితులు దుమ్ముగూడెం కార్యాలయంలో నెలకొనడం. ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిజంగా అధికారులు పట్టభద్రుల ఓటు నమోదు కోసం కృషి చేస్తున్నారా లేక ఓటర్ నమోదు ప్రక్రియని ఏదో లే అని కానిస్తున్నారా అన్న అనుమానాలు మండలంలో రేకేత్తాయి.
భద్రాచలంలో ఇదే కథ మారుమూల గ్రామాలకు తిరగడానికి ఒళ్ళు వంగని బిఎల్వోలు పూర్తిగా గ్రామాలలో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ కూడా చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం కి ఆనుకొని ఉన్న సారపాక చింతగూడెం లో కనీసం 18 నమోదు పత్రాన్ని అడుగుతుంటే తాసిల్దార్ నిర్లక్ష్యపు వైఖరి చూపిస్తున్నారు అంటూ ఆ గ్రామ పట్టభద్రులు తెలియజేశారు. కనీసం పట్టభద్రులకు సహకరించకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారు అంటూ మండల గ్రాడ్యుయేట్లు వారిపై ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మంచి నాయకున్ని ఎలా ఎన్నుకుంటారు అని. గ్రాడిట్లు వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయం పట్ల ఎన్నికల అధికారి తక్షణ చర్య తీసుకుని ఇంకా మిగిలి ఉన్న పట్టభద్రుల విషయంలో ఎమ్మార్వోల నిర్లక్ష్యం వల్ల ఓటు నమోదు చేసుకొని వారికోసం నమోదు తేదీని పొడిగించాలని. నమోదు చేసుకోని వారు ఇంకా మిగిలి ఉన్నారు అంటూ. నిర్లక్ష్యం వహించిన మండల తాసిదారులపై చర్య తీసుకొని నమోదు తేదిని పొడిగించవలసిందిగా పట్టా బద్రులు కోరుకుంటున్నారు.





