బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాలకు తీసుకుంటున్నారనే వార్తలకు తాజాగా ఐశ్వర్య చెక్ పెట్టారు. నేడు అభిషేక్ బర్త్ డే సందర్భంగా భర్త, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఐష్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆనందం, ప్రేమ, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో విడాకుల వార్తలకు ఐష్ చెక్ పెట్టిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.





