అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్‌ఎస్ అధినేత, శాసనసభ పక్షనేత కేసీఆర్ ఇవాళ తెలంగాణభవన్‌కు రానున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.





