మన్యం న్యూస్ గుండాల: మండలంలో ఎవరైనా నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కిన్నర రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పాన్ షాప్, కిరాణా షాప్ లో తనిఖీలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిషేధిత గంజాయి విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపుతామని అన్నారు ఎవరైనా గంజాయి విక్రయించినట్లు అనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు





