మన్యం న్యూస్ గుండాల: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ప్రజాపందా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మాస్ లైన్ వాల్ రైటింగ్ రాస్తున్న క్రమంలో కొందరు అరాచక వాదులు నేతలపై దాడి వారిపైనే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. తక్షణమే కేసులన్నిటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమ ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సనప కుమార్, లక్ష్మయ్య, పాపారావు, రాజు తదితరులు పాల్గొన్నారు





