పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా క్రేజీ అప్డేట్ ను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన పార్ట్ ను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపింది.





